తెలుగులో సమంత… తమిళంలో కార్తీ
కన్నడలో వాసు నాన్ పక్కా కమర్షియల్ అనే సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అజిత్ వాసన్ ఉగ్గిన. ఆయన తాజాగా తెరకెక్కిస్తోన్న రెండో సినిమా మధురవాడ. సరైన్ సమర్పణలో డ్రామా క్వీన్, జస్వంత్ ఆర్ట్స్ పతాకంపై యాక్షన్ థ్రిల్లర్ కథతో తెలుగు, కన్నడ, తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. బి.వి.కృష్ణారెడ్డి, ఎం.వెంకటేష్ నిర్మాతలు. తెలుగులో సమంత, తమిళంలో కార్తీ చేతుల మీదుగా చిత్ర ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. నూతన నటీనటులు నటించిన ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ దిలీప్ చక్రవర్తి, యోగి, ఎడిటర్ హర్ష.













