కోలీవుడ్‌లో టాప్ డైరెక్టర్లుగా లోకేష్, నెల్సన్.. రెమ్యునరేషన్లు తెలిస్తే షాకవ్వాల్సిందే!
కోలీవుడ్‌లో తమదైన శైలిలో సినిమాలు తెరకెక్కిస్తూ స్టార్ డైరెక్టర్లుగా ఎదిగారు లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్. వీరిద్దరూ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో లోకేష్ కనగరాజ్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించనున్నారు. AA23గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా టాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా రూపొందనుంది. మరోవైపు జైలర్2తో మరోసారి సత్తా చాటిన నెల్సన్.. తన నెక్ట్స్ మూవీలో కమల్ హాసన్, రజనీకాంత్‌లను కలిపి తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం కోలీవుడ్ లో భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న డైరెక్టర్ల లిస్ట్ లో వీరిద్దరూ ముందున్నారు. అల్లు అర్జున్ సినిమాకు లోకేష్ కనగరాజ్ రూ.70 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం. ఇక నెల్సన్ తన నెక్ట్స్ సినిమాకు ఏకంగా రూ.75 కోట్ల రెమ్యునరేషన్ అందుకోనున్నారట. జైలర్2 కోసం ఆయన రూ.50 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో డైరెక్టర్ల రెమ్యూనరేషన్ విషయంలో వీరిద్దరూ సరికొత్త స్థాయికి చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి
ఇదిలా ఉంటే నెల్సన్‌కు తెలుగులోనూ ఓ భారీ ప్రాజెక్ట్ రెడీగా ఉంది. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. మరోవైపు లోకేష్ డైరెక్టర్ గానే కాకుండా నటుడిగానూ బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న డీసీ2తో పాటు ఖైదీ2, సూర్యతో ఓ సినిమా డిస్కషన్స్ దశలో ఉన్నాయి. అటు పాన్ ఇండియా స్టార్లతో భారీ సినిమాలు, ఇటు భారీ రెమ్యూనరేషన్లు.. ఇలా ఈ ఇద్దరు డైరెక్టర్లు తమ కెరీర్లో అత్యున్నత దశను ఆస్వాదిస్తున్నారు.







