మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన కియారా- సిద్ధార్థ్!
కియారా అద్వానీ(kiara advani), సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth malhotra) మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తమ రెండో సంతానం రాబోతున్న విషయాన్ని ఈ బాలీవుడ్ జంట సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.చిన్నారి బూట్లను మూడు చేతులు పట్టుకున్నట్టుగా ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. తమ లైఫ్ లోకి మరోసారి ప్రేమ, ఆనందం ప్రవేశించబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
కియారా, సిద్ధార్థ్ దంపతులకు ఇప్పటికే ఓ కూతురు ఉంది. 2025 జూలై 15న వీరికి ఆడబిడ్డ జన్మించింది. ఆమెకు సారాయా(Saaraya) అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. మొదటి సంతానం తర్వాత తమ వ్యక్తిగత జీవితాన్ని మీడియా దృష్టికి దూరంగా ఉంచేందుకు ఈ జంట ప్రయత్నించింది. అయితే సిద్ధార్థ్ ఇటీవల బిగ్‌బాస్ 20 కార్యక్రమంలో తండ్రిగా తన అనుభవాలను పంచుకున్నారు. తండ్రి అనే పాత్ర తనకు దక్కిన అత్యుత్తమ బాధ్యత అంటూ చెప్పిన ఆయనతో.. సల్మాన్ ఖాన్(salman khan) సరదాగా మరో బిడ్డ గురించి కూడా ప్రస్తావించడం అప్పట్లో ఆసక్తిని రేకెత్తించింది.
ఇప్పుడు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించడంతో కియారా, సిద్ధార్థ్ ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి తర్వాత కెరీర్‌తో పాటూ ఫ్యామిలీ లైఫ్ కు ప్రాధాన్యత ఇస్తున్న ఈ జంట.. రెండో బిడ్డ రాకను కూడా చాలా ప్రైవేట్‌గా ఉంచినట్లు కనిపిస్తోంది. సినిమాల విషయానికొస్తే కియారా ఇటీవల టాక్సిక్(toxic) లో కనిపించగా, సిద్ధార్థ్ చివరిగా ది వీవాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్(The Vvan: force of the forest) తో ఆడియన్స్ ను పలకరించారు.








