చిరంజీవి- శ్రీకాంత్ ఓదెల సినిమాకు బ్రేక్?
నేచురల్ స్టార్ నాని(nani), డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) కాంబినేషన్లో వచ్చిన దసరా తర్వాత మరోసారి ది ప్యారడైజ్(the paradise) కోసం కలిసి పనిచేశారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణ దశలో పలుమార్లు ఆలస్యం కావడంతో బడ్జెట్ కూడా పెరిగింది. రిలీజ్ తర్వాత సినిమాకు మిక్డ్స్ రెస్పాన్స్ రావడంతో ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించలేదు. నైజాం ప్రాంతంలో ఓ మోస్తరు స్థాయిలో నిలబడినప్పటికీ, మిగతా ఏరియాల్లో మాత్రం సినిమా పనితీరు నిరాశపరిచినట్టుగా ట్రేడ్ వర్గాల్లో డిస్కషన్ జరిగింది. అయితే మిక్డ్స్ టాక్ తో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టు మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల ప్రభావం నాని- చిరంజీవి(chiranjeevi) కాంబినేషన్లో అనుకున్న ప్రాజెక్ట్‌పై పడినట్టుగా కనిపిస్తోంది.
ది ప్యారడైజ్ పూర్తి కాకముందే మెగాస్టార్ చిరంజీవితో నాని ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ ప్రాజెక్ట్‌కు నాని, సుధాకర్ చెరుకూరి(sudhakar cherukuri) నిర్మాతలుగా వ్యవహరించాల్సి ఉంది. కథపై చిరంజీవి కూడా ఆసక్తి చూపించినప్పటికీ, ది ప్యారడైజ్ నిర్మాణానికి పట్టిన టైమ్, పెరిగిన బడ్జెట్, తదితర అంశాలు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ షెడ్యూల్‌ను ప్రభావితం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాపై కొత్తగా ఎలాంటి డిస్కషన్స్ జరగడం లేదని నాని స్వయంగా చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ చిరంజీవి సినిమా ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు. చిరంజీవికి ఇప్పటికే పలు కమిట్మెంట్లు ఉండటం, ది ప్యారడైజ్ అనుకున్న దానికంటే ఎక్కువ కాలం తీసుకోవడంతో పరిస్థితులు మారిపోయాయని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా పూర్తిగా ఆగిపోయిందా, లేక ఫ్యూచర్ లో మళ్లీ పట్టాలెక్కుతుందా అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. మరోవైపు నాని నవంబర్‌లో సుజీత్(Sujeeth) దర్శకత్వంలో బ్లడీ రోమియో(Bloody Romeo) షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.








