నాగశౌర్య సరసన కేతికా శర్మ
సోషల్ మీడియా సెన్సేషన్ కేతికా శర్మ ప్రస్తుతం రొమాంటిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరీ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉండగానే మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట ఈ ఢిల్లీ భామ. ఈ సారి నాగశౌర్యతో జత కట్టబోతోందట. సుకుమార్ రైటింగ్స్, శరత్ మరార్ కాంబినేషన్లో ఓ సినిమా నిర్మితమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కాశీ విశాల్ దర్శకుడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా కేతికను ఎంపికచేశారట. ఒక సినిమా రిలీజ్ కాకుండానే మరో సినిమా అవకాశాన్ని దక్కించుకున్న ఈ ఢిల్లీ భామ అదృష్టం మామూలుగా లేదనుకోవాలి.













