అమ్మనైతే ఐటమ్స్ చేయకూడదా?
నిన్నటి తరం కథానాయిక కస్తూరి సినీ ప్రేమికులకు సుపరిచితమే. తెలుగులో సొగాడ్డి పెళ్లాం, మా ఆయన బంగారం, నిప్పురవ్వ వంటి చిత్రాలతో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని నటకు గ్యాప్ ఇచ్చింది. 2010లో తమిళపథం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తనకు తగ్గ పాత్రలను చేస్తూ వచ్చింది. తాజాగా తమిళపథం సీక్వెల్‌గా రూపొందుతున్న తమిథపథం 2.0 సినిమాలో కస్తూరి ఓ ఐటమ్ సాంగ్‌తో అదరగొట్టింది. ఈ చిత్రం టీజర్లో కసూర్తి కుర్ర హీరోయిన్లకు ధీటుగా గ్లామర్ మెయింటెన్ చేయటంతో ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
నాలుగు పదుల వయసులో కూడా ఫిట్నెస్ను మెంటనెన్స్ చేస్తూ కస్తూరిని చూసి కుర్రకారు ఫిదా అయిపోయింది. అయితే ఈ వయసులో ఐటమ్‌సాంగ్‌లో నటించటం ఏమిటంటూ ఓ నెటిజన్ కస్తూరిని కామెంట్ చేశారు. దీంతో ఆ నెటిజన్‌కు కస్తూరి ఘాటుగానే రిటార్ట్ ఇచ్చింది. పిల్లలపట్ల బాధ్యతగా ఉంటూ తల్లి పాత్రలు చేయాల్సిన వయసులో ఐటమ్ సాంగ్స్ ఏమిటి అంటూ ఓ అభిమాని ప్రశ్నించాడు. దానికి అమె ఘాటుగా సమాధానమిచ్చింది. అమ్మనైనంత మాత్రన ఐటమ్ సాంగ్ చేయకూడదని రూల్ ఉందా? అంటూ ఘాటుగా బదులిచ్చింది. ఒక నటిగా శృంగారాత్మకంగా కన్పించటం తప్పుకాదని నటనలో పాత్రను చూడాలి తప్ప నటిని కాదని రిటార్డ్ ఇచ్చింది.













