30 కోట్ల విరాళాలు తిరిగిచ్చేస్తా : కమల్ హాసన్
త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నానని ప్రకటించిన కమల్ హాసన్ తనకు విరాళాలుగా వచ్చిన రూ.30 కోట్లను తిరిగి ఇచ్చేయనున్నట్లు చెప్పాడు. పార్టీకి సంబంధించి ఇంకా ఎలాంటి పని మొదలుపెట్టలేదని, అలాంటప్పుడు ఈ డబ్బు తనతో ఉంచుకోవడం చట్ట విరుద్ధమవుతందని కమల్ అన్నారు. పార్టీ త్వరలోనే అని ప్రకటించినా ఇప్పటికే కచ్చితమైన సమయం మాత్రం అతను చెప్పలేదు. విరాళాలు తిరిగిచ్చేస్తున్నానంటే నేను వెనుకడుగు వేస్తున్నట్లు కాదు. అలాగని డబ్బు తీసుకోనని కాదు. అయితే ముందు పార్టీ పేరు పెట్టి, ప్రారంభించాలని అని కమల్ ఓ తమిళ మ్యాగజైన్‌కు రాసిన కాలమ్‌లో సృష్టం చేశారు.













