బిజినెస్ మాన్ తో కాజల్ అగర్వాల్ పెళ్లి…!
మహేష్ బాబు హీరోగా చేసిన బిజినెస్ మాన్ లో హీరోయిన్ కాజల్ అయితే ఇప్పుడు ఏటంటా? రియల్ లైఫ్ లో ఇప్పుడు బిజినెస్ మాన్ నే పెళ్లి చేసుకోబోతుంది. కొద్దికాలంగా కాజల్ తన ఫ్యామిలీ సర్కిల్లో ఓ వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తున్నారనే విషయం ఇండైరెక్ట్ గా తెలియచేసింది. మధ్యలో ఒకరితో లవ్లీ మూమెంట్స్ షేర్ చేసుకొంటున్నట్టు ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి డేటింగ్ వార్తలకు జోష్ పెంచింది. ఇటీవల తన ఫ్రెండ్స్‌తో కలిసి బాయ్‌ఫ్రెండ్‌తో టూర్‌కు వెళ్లినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రతీ హీరోయిన్‌కు సాధారణంగా వచ్చే డేటింగ్, అఫైర్ల రూమర్లను తనపై రాకుండా జాగ్రత్తపడుతుంటారు. కానీ ఇటీవల కాలంలో కాజల్‌పై డేటింగ్, పెళ్లి గురించి వార్తలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తాజాగా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చినట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. కాజల్ డేటింవగ్, పెళ్లి గురించి వినిపిస్తున్న వార్త ఏమిటంటే….
ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే యువ నటీనటులకు పెళ్లి అంటే పట్టింపు ఉండేది కాదు. లాక్డౌన్లో బీజీ లైఫ్‌కు దూరంగా ఉండటం, ఒంటరి జీవితం గడపడటంతో తోడు గురించి ఇష్టం పెరిగినట్టు కచ్చితంగా స్పష్టమవుతున్నది. ఇటీవల నిఖిల్, రానా, నిహారిక పరిస్థితి చూస్తే అదే అర్ధమవుతున్నది. తాజాగా ఆ లిస్టులో కాజల్ కూడా చేరబోతున్నదనే వార్త గట్టిగానే వినిపిస్తున్నది. అయితే తన డేటింగ్ చేస్తున్నది ముంబైలోని ఓ వ్యాపారవేత్తతో అనే విషయం మీడియాలో ప్రచారం జరుగుతున్నది. కొద్దికాలంగా వారి మధ్య కొనసాగుతున్న ఆఫైర్ ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. అందుకు తన తల్లి దండ్రుల అంగీకారం కూడా పెళ్లి లైన్ క్లియర్ చేసిందనే వార్తలు వచ్చాయి. అంతేకాకుండా పెళ్లికి ముందే తాను అంగీకరించిన ప్రాజెక్టులు పూర్తి చేసే ఆలోచనలో కాజల్ ఉన్నారు. పెళ్లి ఏర్పాట్లు జరిగే లోపే నటనకు దూరంగా అవ్వాలనే ప్లాన్ చేసుకొంటున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. క్వీన్ రీమేక్ పారిస్ పారిస్, మోసగాళ్లు, ఆచార్య, ముంబై సాగా, హే సినామిక, ఇండియన్ 2 చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది.













