జెట్ స్పీడులో దూసుకెళ్తున్న కాకా
చిరంజీవి(chiranjeevi) సినిమా అంటేనే ఫ్యాన్స్ లో అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అందుకే ఆయన అప్పుడప్పుడు ఇచ్చే చిన్న చిన్న అప్డేట్స్కు కూడా స్పెషల్ క్రేజ్ ఉంటుంది. తాజాగా కాకా(kaaka) గురించి చిరంజీవి చెప్పిన విషయాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఈ సినిమాలో తన క్యారెక్టర్ పేరు కదిరి కాళిదాస్(kadiri kalidas) అని ఇప్పటికే వెల్లడించిన చిరు.. తాజాగా షూటింగ్ ఎంత ఫాస్ట్ గా జరుగుతుందో కూడా చెప్పారు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తవ్వగా, సెకండాఫ్ షూట్ కూడా దాదాపు 30% పూర్తైనట్లు తెలిపారు.
సినిమా షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను కూడా సమాంతరంగా నడిపించడం కాకా టీమ్ స్పెషాలిటీగా కనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్‌ను ఇప్పటికే ఎస్.ఎస్. తమన్(SS Thaman)కు అందించి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వర్క్స్ ప్రారంభించారు. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. డైరెక్టర్ బాబీ(Bobby) ప్రీప్లానింగ్ తో రంగంలోకి దిగడంతో షూటింగ్ షెడ్యూల్స్ ఎక్కడా ఆలస్యం కాకుండా సాగుతున్నాయని తెలుస్తోంది. కథ, తన క్యారెక్టర్‌పై చిరంజీవి చూపిస్తున్న నమ్మకం కూడా ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచుతోంది.
సినిమా నిర్మాణాన్ని కేవలం షూటింగ్ వరకే పరిమితం చేయకుండా ప్రతి విభాగం పనిని ముందుగానే పూర్తి చేసేలా టీమ్ అడుగులు వేస్తోంది. దీంతో సంక్రాంతి నాటికి కాకాను భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్ తో వర్క్స్ సాగుతున్నాయి. KVN ప్రొడక్షన్స్(KVN Productions) ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనస్వర రాజన్(Anaswara Rajan) పాత్రలో నటిస్తోంది. జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్‌గా నిలిచేలా రూపుదిద్దుకుంటోంది.








