హనుమాన్ అంశ్ సౌత్ రిలీజ్‌కు భారీ సంస్థ ఎంట్రీ
చిన్న బడ్జెట్లో తెరకెక్కి అంచనాలను మించి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న హనుమాన్ అంశ్(hanuman ansh) ఇప్పుడు సౌత్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఐదో వారంలోనూ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. సౌత్ భాషలకు సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ పూర్తయినప్పటికీ, రిలీజెప్పుడుంటుందనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు.
ఈ నేపథ్యంలో సౌత్ రిలీజ్‌కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థగా ఉన్న హోంబలే ఫిలింస్(Hombale films) హనుమాన్ అంశ్ సినిమా మొత్తం సౌత్ థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీంతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మార్గం సుగమమైంది. త్వరలోనే రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.
విశాల్ చతుర్వేది(Vishal Chaturvedi) దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించిన ఈ సినిమా డివైన్ డీటూర్ దట్ ఛేంజ్డ్ మై లైఫ్ అనే బుక్ ఆధారంగా రూపొందింది. నీమ్ కరోలి బాబా(neem karoli baba) జీవితంలోని అంశాలను కథకు ఆధారంగా చేసుకున్న ఈ సినిమాకు సౌత్‌లో ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా హోంబలే ఫిలింస్ వంటి సంస్థ రంగంలోకి రావడంతో తెలుగు సహా దక్షిణాది ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగే అవకాశముంది.








