ఆర్ఆర్ఆర్ పై నోరు జారిన కె.ఎ.పాల్ : నీ ముఖం రా! అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చిన ఆర్జీవీ
ఆర్ఆర్ఆర్ సినిమా చూడటం అనేది టైమ్ వేస్ట్ అంటూ ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె.ఎ.పాల్ అన్నారు. దానిపై నెటిజన్స్ ఫైర్ అయ్యారు. వారితో పాటు వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ కూడా పాల్‌ను తిడుతూ ట్వీట్ చేయడం గమనార్హం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్ ఉన్న ఈ పాన్ ఇండియా చిత్రం మార్చి 25న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. సినీ అభిమానులందరూ ఈ సినిమాను అప్రిషియేట్ చేస్తున్నారు. జక్కన్న పనితనాన్ని, ఎన్టీఆర్ – రామ్ చరణ్ పెర్ఫామెన్స్‌ను మెచ్చుకుంటున్నారు.
అయితే ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమాపై విమర్శలు చేశారు. ఓ వీడియోలో పాల్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమా ఒక టైమ్ వేస్ట్ సినిమా అని చెప్పారు. కె.ఎ.పాల్ అలా ఆర్ఆర్ఆర్ సినిమాపై విమర్శలు చేయడంతో నెటిజన్స్ ఆయనపై ఫుల్ ఫైర్ అయ్యారు. ‘ఎవడ్రా వీడు సగం గుండు సగం నాలెడ్జి తో కపాల మొహం వేసుకొని సగం సగం మాట్లాడుతున్నాడు. తీసుకెళ్లి ఎక్కడైనా చూపించండ్రా పాపం’ .. ఇలా పలు కామెంట్స్‌తో పాల్‌పై సెట్సైర్లు వేశారు. ఇక కాంట్రవర్సియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అయితే ట్విట్టర్ వేదికగా పాల్‌పై తన కోపాన్ని కక్కేశారు. పాల్ మాట్లాడిన సదరు వీడియో క్లిప్‌ను షేర్ చేసిన వర్మ ‘నీ మొహం రా’ అని కామెంట్ చేశారు. అలా పాల్‌పై వర్మ రియాక్ట్ అయిన తీరు చూసిన ఫ్యాన్స్ .. కరెక్ట్ పని చేశావంటూ మెచ్చుకుంటున్నారు. పాల్‌ను విమర్శించినట్లే బాలీవుడ్లో ఆర్ఆర్ఆర్ సినిమాను విమర్శించిన కమల్ ఆర్.ఖాన్‌ను కూడా తగులు కోవాలని నెటిజన్స్ కోరుతున్నారు.
RGV Tweet:
https://twitter.com/RGVzoomin/













