రంజిత్ని అభినందించిన కొణిజేటి రోశయ్య
ఆర్కె కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామానాయుడు జయంతి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఫిల్మ్‌ఛాంబర్‌లో ఘనంగా నిర్వహించారని సంస్థ అధినేత డాక్టర్ రంజిత్ కుమార్ తెలిపారు. మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మాట్లాడుతూ సినిమా రంగంలో ఎంతగానో కృషి చేసిన డాక్టర్ రామానాయుడు జయంతిని ఇంత ఘనంగా నిర్వహించిన రంజిత్‌కుమార్‌ను అభినందించారు. అలాగే రామానాయుడు నాకు సన్నిహితులు, ఆయన సినిమా రంగానికి చేసిన కృషికి అనేక అవార్డులు సాధించిన ఘనుడు ఆయనకు శిలా విగ్రహం ఏర్పాటు చేయటం పట్ల అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.













