2023 లో బిజీ బిజీ గా తారక్..?
RRR కి ముందు RRR కి తర్వాత సీన్ మారిపోయింది. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ డం ని అందుకున్న తారక్, ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే తన లైనప్ ని బలోపేతం చేసుకుంటున్నాడు. తారక్ వరుసగా పాన్ ఇండియా డైరెక్టర్స్ తో మంతనాలు జరుపుతున్నారు అనేది తాజా సమాచారం.
RRR తర్వాత చాలా గాప్ తీస్తకున్న తారక్ , 2023 లో అసలు గాప్ లేని షెడ్యూల్స్ తో గడపనున్నారు. తారక్ నటించాల్సిన ఎన్టీఆర్ ౩౦ ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు.
వచ్చే ఏడాది అంతా కాల్ షీట్స్ తో నిండిపోయాయి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. వరుసగా మూడు లేదా నాలుగు తెలుగు సినిమాలకు లైన్ క్లియర్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఎన్టీఆర్ ౩౦ సినిమా షూటింగ్ డిసెంబర్ లేదా జనవరి లో ప్రారంభం కానుండగా, తర్వాత ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31 సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. 2023 లో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అవుతుంది.
ఈ మూవీ కూడా ఎక్కువ విరామం లేకుండా వేగంగా షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంటుంది . ఇదే కాకుండా మరి కొన్ని ప్రాజెక్ట్స్ ని కూడా సైన్ చేసిన తారక్, అన్ని షూటింగ్స్ ని అతి త్వరగా పూర్తి చెయ్యాలని అనునుకుంటున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే సర్ప్రైజింగ్ ప్రకటనలతో తారక్ దూసుకు వస్తాడని సమాచారం.
చూస్తుంటే ఇతర పాన్ ఇండియా స్టార్ల తో తారక్ వార్ నడిపించేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తుంది.













