ఎన్టీఆర్‌కు జోడీగా సమంత!
ఎన్టీఆర్ తన 30వ చిత్రం క్లాస్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో ప్రకటించేశారు. మే నెల నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ విషయంలో గత కొద్దిరోజులుగా విపరీతమైన చర్చ సాగుతోంది. పూజాహెగ్డే హీరోయిన్ అని కొందరు, లేదు ఈసారి ఎన్టీఆర్‌కు జోడీగా రష్మికను ఎంపిక చేశారంటూ భిన్న కథనాలు విన్పిస్తున్నాయి. కాగా తాజా మరో భామ తెరపైకొచ్చింది. త్రివిక్రమ్ మరో మారు ఎన్టీఆర్‌కు జోడీగా సమంతను తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉండగా, ఒకరు సమంతను తీసుకోనున్నారని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఎన్టీఆర్, సమంత కాంబినేషన్లో వచ్చే 5వ చిత్రం అవుతుంది ఇది.













