హనుమాన్ దీక్షలో ఎన్టీఆర్.. తారక్ పిక్స్ వైరల్
హనుమాన్ దీక్షలో ఉన్న తారక్ లుక్ బయటకు రావడంతో ఈ పిక్ క్షణాల్లో వైరల్ అయింది. ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోవడం ఆయన అభిమానుల .గత కొన్ని రోజులుగా సినీ సర్కిల్స్‌లో నడుస్తున్న టాక్ నిజమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోబోతున్నారని విన్నాం. అంతకుముందు ఎప్పుడూ ఇలాంటి దీక్ష చేపట్టని తారక్ మొట్టమొదటిసారి హనుమాన్ దీక్ష తీసుకున్నారని తెలియడం జనాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో హనుమాన్ దీక్షలో ఉన్న తారక్ లుక్ బయటకు రావడంతో ఈ పిక్ క్షణాల్లో వైరల్ అయింది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ దీక్ష తీసుకున్నారు ఎన్టీఆర్. కాషాయ దుస్తులు ధరించి మాలధారణలో కనిపించారు. మెడలో హనుమాన్ మాల వేసుకొని, నుదిటిన కుంకుమ పెట్టుకున్నారు. మొదటిసారి ఈ వస్త్రధారణలో ఎన్టీఆర్‌ని చూసిన నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం దీక్షలో ఎన్టీఆర్ కనిపిస్తున్న ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ హనుమాన్ దీక్ష 21 రోజుల పాటు ఉంటుందని, దీన్ని తారక్ ఎంతో నియమ నిబంధనలతో పూర్తిచేయనున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. దీక్ష పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ తిరిగి సెట్స్ పైకి వెళ్లనున్నారని సమాచారం. ఇటీవలే రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ సాధించింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత రామ్ చరణ్ అయ్యప్పస్వామి మాల వేయగా.. ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకోవడం విశేషం.జూన్ నుండి షూటింగ్ ప్రారంభం అయ్యే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలో భాగం కాబోతున్నారు ఎన్టీఆర్. NTR#30 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా సెట్స్ మీదకు రానుంది.













