జక్కన్నకు షాక్ ఇచ్చిన జాహ్నవి
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి స్లో అండ్ స్టడీగా వెళ్తూనే.. రోజురోజుకూ క్రేజ్ పెంచుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ తన తల్లి తరహాలోనే ఓ క్రేజీ చాన్స్‌కు నో చెప్పడం అందరికీ షాకిచ్చింది. ఆ క్రేజీ ఆఫర్ ఏంటంటే.. బాహుబలిలాంటి సంచలన చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి, ఎన్టీఆర్-చరణ్‌లతో ఆర్ఆర్ఆర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ ఒక హీరోయిన్గా నటిస్తుంటే, మరో హీరోయిన్ పాత్రకోసం జాహ్నవికి ఆఫర్ ఇచ్చాడట జక్కన్న. ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా పాత్ర చేయాలని అడిగాడట. అయితే ఈసినిమా విషయంలో జాహ్నవి అంతగా ఆసక్తి చూపించడం లేదన్నది బాలీవుడ్ మీడియా వర్గాల్లో సాగుతోన్న చర్య.
రాజమౌళి సినిమాలో అవకాశం రావడమంటే హీరోయిన్లకు పండుగ ఎదురొచ్చినట్టు. అలాంటి ఆఫర్‌పై జాహ్నవి ఎందుకు ఆసక్తి చూపించడం లేదన్నది మిస్టరీ. ఇంతకు ముందు బాహుబలిలో రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్రకోసం జక్కన్న శ్రీదేవిని సంప్రదించాడు. శ్రీదేవి ఆ పాత్ర చేయలేదు. ఇపుడు శ్రీదేవి కూతురు జాహ్నవి కూడా తల్లి తరహా లోనే ఆఫర్‌కు నో చెప్పి కెరీర్లో మంచి చాన్స్ పోగొట్టుకుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో శ్రీదేవి విషయంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యల కారణంగానే జాహ్నవి ఈ ప్రాజెక్టుకు నో చెప్పి ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.













