మా అధ్యక్ష బరిలో జీవితా రాజశేఖర్ ?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు తెలుగు చిత్రసీమలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మా అధ్యక్ష రేసులో సీనియర్ నటి జీవితా రాజశేఖర్ ఎంటీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. మా అధ్యక్ష పదవి కోసం ఆమె సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. మా కార్యదర్శిగా కొనసాగుతున్న జీవితా రాజశేఖర్ అధ్యక్ష బరిలో నిలవబోతున్నారనే వార్తలు తెలుగు చిత్రసీమలో హాట్‍టాపిక్‍గా మారాయి. సెప్టెంబర్‍లో మా ఎన్నికలు జరుగనున్నాయి. ఇంకా మూడు నెలల సమయం ఉండగానే తెలుగు పరిశ్రమలో మా ఎన్నికలు అనేక మలుపులతో ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష బరిలో ప్రకాష్‍రాజ్, మంచు విష్ణు నిలవబోతున్నట్లు ప్రకటించారు. అధ్యక్ష పదవికి పోటీ పడాలనుకుంటున్న విషయాన్ని మరో రెండు రోజుల్లో జీవిత అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నారని తెలిసింది.