మీ అమ్మ నీ రూపంలో జీవించే ఉంది
బోనీకపూర్-శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ నటిస్తున్న తొలి సినిమా ధడక్ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో జాన్వీ బిజీగా ఉంది. అయితే, జాన్వీకి సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్గా మారింది. జాన్వీ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఈ ఫొటోను షేర్ చేసిన రెండుమూడు గంటల్లోనే దాదాపు రెండు లక్షలకు పైగా లైక్స్, వేలాది కామెంట్స్ వచ్చాయి. నీలో శ్రీదేవిని చూస్తున్నాం, మీ అమ్మ నీ రూపంలో జీవించే ఉంది, శ్రీదేవిగారి కళ్లలానే మీ కళ్లూ చాలా ఎక్స్ ప్రెసివ్ గా ఉన్నాయి అంటూ జాన్వీని ప్రశంసించారు.













