అలాంటిది ఏమీ లేదు …సాయి పల్లవి
చెన్నైలో ఓ పుకారు మొదలైంది. కొన్ని నిమిష్లాలోనే అది ఇంతింతై ఎంతెంతో దూరం వెళ్లిపోయింది. అదేంటంటే తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్, నటి సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతున్నారని. ఆ విషయాన్ని క్లారిఫై చేసుకోవడానికి విజయ్, సాయి పల్లవితో వర్క్ చేసిన వాళ్లను సంప్రదించగా ఈ వార్తలను కొట్టిపారేశారు. మదరాస పట్టిణమ్, దైవ తిరుమగళ్ ( తెలుగులో నాన్న), దేవి (అభినేత్రి), దియ (కణం) వంటి సినిమాలను తెరక్కించారు ఏఎల్ విజయ్. 2016లో విజయ్ అమలా పాల్ పెళ్లి చేసుకున్నారు. 2017లో డైవర్స్ తీసుకున్నారు. గత ఏడాది దియ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటించారు. ఆ సినిమా టైమ్లో వీరి మధ్య స్నేహం ఏర్పడిందట. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లికూడా చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని, ఈ విషయాన్ని కొన్ని రోజుల్లో ప్రకటించాలనుకుంటున్నారు అన్నది ప్రచారంలో ఉన్న వార్తల సారంశం. అటువంటిదేం లేదు. ఈ వార్త ఎక్కడ నుంచి వచ్చిందో ఐడియా లేదు.













