మళ్లీ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నా గోవాబ్యూటీ
దేవదాసుతో ఎంట్రీ ఇచ్చి, పోకిరి చిత్రంలో స్టార్డమ్ సంపాదించుకుని సుమారు పదేళ్లపాటు తెలుగులో నంబర్ వన్ హీరోయిన్గా వెలుగొందిన ఇలియానా, ఆపై బాలీవుడ్‌పై మోజుతో తెలుగును అలక్ష్యం చేయడం తెలిసిదే. ఈలోపు అమె స్థానాన్ని చాలామంది ఆక్రమించేశారు. టాలీవుడ్లో కలిసి వచ్చినట్లుగా.. బాలీవుడ్లో కలిసి రాకపోవడంతో మళ్లీ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నా ఇలాయానా.. ఎట్టి పరిస్థితుల్లో తన పూర్వ వైభవం పొందాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో రవితేజ సరసన నటిస్తున్న ఇలియానా.. ఈ చిత్రం అనంతరం మహేష్‌బాబు సుకుమార్ కలయికలో రూపొందునున్న చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మరి సెకండ్ ఇన్నింగ్స్తోనూ స్టన్నింగ్ రిజల్ట్స్ ఎక్ప్‌పెక్ట్ చేస్తున్న ఇలియానాకు ఎటువంటి ఫలితాలు ఎదురవుతాయో వేచి చూడల్సిందే.













