చిరు సరసన ఇలియానా!
ఇటీవల తెలుగు తెరకి దూరమైన ఇలియానా ఇప్పుడు ఏకంగా చిరంజీవితోనే నటించబోతుందట. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో చిరు సరసన కథానాయికగా ఇలియానాని తీసుకోబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి లో నటిస్తున్నారు. అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇందులో కథానాయికగా నటించబోతుందంటూ నయనతార, అనుష్క, కీర్తిసురేష్, తమన్నా, కాజల్ వంటి తదితరుల పేర్లు బాగా వినిపించాయి. ఒకరి తర్వాత మరొకరి పేరు ఫోకస్‌లోకి వచ్చినప్పటికీ దీనిపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. అయితే తాజాగా అందరిని ఆశ్చర్య పరుస్తూ మరో కథానాయిక ఇలియానా పేరు వినిపించింది. చిరు సరసన మెయిన్ లీడ్‌గా మెని ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉందట. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇదే వర్కౌట్ అయితే ఇలియానాకిది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. గతేడాది తెలుగులో అమర్ అక్బర్ ఆంటోనిలో మెరిసిన ఇలియానా ప్రస్తుతం హిందీలో పాగల్పంటి లోనూ నటిస్తోంది.













