గోవా బ్యూటీ ప్రేమ కథకు బ్రేకప్ ?
గోవా బ్యూటీ ఇలియానా, లండన్‌కు చెందినఫొటోగ్రాఫర్ అండ్రూ నీబోన్‌తో గాఢమైన ప్రేమలో మునిగి తేలుతున్నారనీ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ జంట తాజాగా చేతులు దులుపుకుని విడిపోయారని ప్రచారం జరుగుతోంది. ఆండ్రూతో కలిసి ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి తొలగించారు ఇలియానా. అలాగే ఇన్‌స్టాలో ఒకరి నొకరు ఆన్ ఫాలో చేసుకున్నారు. దీంతో ఆమెకు, ఆండ్రూకు మద్య విభేదాలు వచ్చాయన్న వార్తలు నిజమేనని ఊహించుకోవచ్చు. ఇలియానా ఓ సందర్భంలో ఆండ్రూని హబ్బీ (భర్త) అంటూ ఇన్‌స్టాలో క్యాప్షన్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ బ్రేకప్ ప్రచారం గురించి ఇలియానా స్పందిస్తే కానీ ఊహాగానాలకు పుల్‌స్టాప్ పడదు. ఇక సినిమాల విషయానికి వస్తే, హిందీలో ఇలియానా కథానాయికగా నటించిన పాగల్ పాంతీ సినిమా విడుదలకు రెడీగా ఉంది.













