హల్చల్ టీమ్‌కు సందీప్ రెడ్డి అభినందన
శ్రీరాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై గణేష్ కొల్లూరి నిర్మిస్తున్న చిత్రం హల్ చల్. రుద్రాక్ష, ధన్య బాలకృష్ణ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను ప్రముఖ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ ట్రైలర్ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండ సినిమా చూస్తారు. ట్రైలర్ నాకు కూడా చాలా నచ్చింది అని ఇలాంటి వినూత్నమైన కథతో వస్తున్న దర్శక నిర్మాతలకు హీరో హీరోయిన్ ఆర్టిస్టులకు, టెక్నిషియన్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు.













