సుశాంత్ గదిలో డిప్రెషన్ మెడిసిన్స్ లభ్యం… కాల్ డేటా ఆధారంగా ముంబై పోలీసుల దర్యాప్తు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత పలు విషయాలు ఒక్కొక్కొటిగా వెలుగులోకి వస్తూ అందర్నీ షాక్ గురిచేస్తున్నాయి. సినిమా కెరీర్‌పై ఆందోళన పడుతూ సుశాంత్ సింగ్ ఆదివారం జూన్ 14వ తేదీన ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే ఆయన మరణం సహజ మరణమా? లేక ఎదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన అంశాలు ఏమింటంటే..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత పలు విషయాలు ఒక్కొక్కొటిగా వెలుగులోకి వస్తూ అందర్నీ షాక్ గురిచేస్తున్నాయి. సినిమా కెరీర్‌పై ఆందోళన పడుతూ సుశాంత్ సింగ్ ఆదివారం జూన్ 14వ తేదీన ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే ఆయన మరణం సహజ మరణమా? లేక ఎదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన అంశాలు ఏమింటంటే..
సైక్రియాటిస్ట్ ని కలిసినట్టుగా ఆధారం హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గత ఆర్నేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నారనే విషయం పోలీసులు, వైద్య నిపుణుల దర్యాప్తులో ప్రాథమికంగా వెల్లడైంది. ఆయన గదిలో సైక్రియాటిస్ట్ వద్ద ట్రీట్మెంట్ తీసుకొన్న వివరాలు, అందుకు ఉపయోగించిన మెడిసిన్స్ లభ్యమయ్యాయి. పోలీసులు వాటిని సేకరించి ల్యాబ్‌కు పంపి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. స్నేహితులందరిని ప్రశ్నిస్తున్నారు సుశాంత్ మృతికి సంబంధించి దర్యాప్తులో భాగంగా స్నేహితులు రియా చక్రవర్తి, మహేష్ శెట్టిని ముంబైలో పోలీసులు ప్రశ్నించేందుకు సమాయత్తమయ్యారు. అలాగే ప్రతీ రోజు సుశాంత్‌తో టచ్‌లో ఉండే స్నేహితులందరి కూడా ప్రశ్నించి ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించేందుకు పోలీసులు తన దర్యాప్తును వేగవంతం చేశారు.
సోదరి ఇంటికి రమ్మన్నా రాలేదు
తన మరణానికి కొన్ని గంటల ముందు సుశాంత్ చాలా క్లుప్తంగా మాట్లాడారని సోదరి వెల్లడించింది. తను డ్రిపెషన్‌తో బాధపడుతున్నారు కానీ ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకొంటారని కలలో కూడా ఊహించలేదు. వారం రోజులుగా సుశాంత్ పరిస్థితి బాగాలేదు. అందుకే తాను తన ఇంటికి రమ్మని చెప్పాను అని సోదరి మీడియాతో పేర్కొన్నారు.
స్నేహితుడు మహేష్ శెట్టికి కాల్ ఇక మరణానికి ముందు సుశాంత్ తన స్నేహితుడు, టెలివిజన్ నటుడు మహేష్ శెట్టికి కాల్ చేశారు. అయితే రాత్రి ఫోన్ ఎత్తకపోవడంతో మాట్లాడటం కుదర్లేదు. కానీ తెల్లవారు జామునే నేను కాల్ చేశాను. అయితే అప్పటికే సుశాంత్ మరణించి ఉంటారు. అందుకే నా కాల్ ఎత్తలేదనే విషయాన్ని మధు శెట్టి మీడియాకు వెల్లడించారు. మేనేజర్ నుంచి కూపీ లాగేందుకు ఇలాంటి పరిస్థితిలో సుశాంత్ మొబైల్ ఫోన్ కాల్స్ దర్యాప్తులో కీలకం కానున్నాయి.
సుశాంత్ మొబైల్ ఫోన్ పాస్వర్డ్ తన మేనేజర్‌కు తెలుసనే విషయాన్ని గుర్తించారు. సుశాంత్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తును చేపట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో రియా చక్రవర్తి, మధుశెట్టి, మేనేజర్‌ను ప్రశ్నించి ఈ మరణం వెనుక అసలు విషయాలను కూపీ లాగాలనే ప్రయత్నం చేస్తున్నారు. బంధువులను కూడా ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు సంబంధించిన ఆర్థిక విషయాలపై కూడా పోలీసులు దృష్టిపెట్టారు.
త్వరలోనే తన బంధువులు, సన్నిహితులును కూడా ప్రశ్నించాలనే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తున్నది. కుటుంభం సభ్యులు సోమవారం పాట్నాలో సుశాంత్ అంత్యక్రియలను నిర్వహించారు.













