అమెరికా నుంచి వీడియో విడుదల చేసిన శివాజీ
ఆపరేషన్ గరుడపై వైసీపీ నేతలు, గుమ్మడికాయ దొంగల్లా భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని హీరో శివాజీ అన్నారు. అమెరికా నుంచి వీడియో విడుదల చేసిన శివాజీ ఆపరేషన్ గరుడపై తనకున్న సమాచారం చెప్పానని, వైసీపీ నేతల ప్రేలాపన ఆపాలని ఆయన పేర్కొన్నారు. నేను వీడియో టేపులో చెప్పింది నిజం చేస్తున్నారు. రాష్ట్రపతి పాలన పెట్టాలని మీరే అడిగారు. ఎందుకు పెట్టాలి? రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వాలంటూన్నారు. నేను రుణాలు ఎగ్గొట్టి వెళ్లలేదు. నాకు చంద్రబాబు డబ్బు ఇచ్చి అమెరికా పంపారంటున్నారు. వీసా చెక్ చేసుకోండి. 54 సార్లు అమెరికా వచ్చాను. కేంద్రం మీ చేతుల్లోనే ఉందని అందరూ అనుకుంటున్నారు. మీ ఇష్టం వచ్చిన దర్యాప్తు చేయండి అని శివాజీ వీడియోలో అన్నారు.













