ఒక్క ఫ్లాపుతో వెంకీ సీన్ మారిపోయిందా?
టాలీవుడ్లో డైరెక్టర్ కెరీర్‌ను డిసైడ్ చేయడంలో సక్సెస్‌ల కంటే తాజా రిజల్ట్ ఎక్కువ ఇంపాక్ట్ చూపుతుంటుంది. వరుసగా రెండు సక్సెస్‌లు అందుకున్న డైరెక్టర్ కు కూడా ఒక్క ఫ్లాపు ఎదురైతే అవకాశాలు ఒక్కసారిగా తగ్గిపోతుంటాయి. ఇప్పుడు డైరెక్టర్ వెంకీ కుడుముల(venky kudumula) పరిస్థితి కూడా ఇలాగే మారింది. ఛలో(chalo)తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన వెంకీ.. తొలి సినిమాతోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత భీష్మ(Bheeshma)తో మరో సక్సెస్‌ను అందుకుని తనపై ఉన్న అంచనాలను మరింత పెంచుకున్నాడు. అయితే మూడో ప్రయత్నంగా వచ్చిన రాబిన్‌హుడ్(Robinhood) ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోవడంతో ఆయన కెరీర్ గ్రాఫ్‌లో మార్పు కనిపించింది.
డైరెక్టర్ గా కొంత గ్యాప్ వచ్చినా వెంకీ మాత్రం సినిమాలకు దూరం కాలేదు. ప్రస్తుతం నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయన నిర్మించిన ఇట్లు అర్జున(Itlu arjuna) అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే సమయంలో డైరెక్టర్ గా తన తర్వాతి సినిమాపై కూడా దృష్టి పెట్టాడు. తనకు బాగా కలిసొచ్చిన ఎంటర్టైన్మెంట్ జానర్లోనే కొత్త కథను రెడీ చేసుకున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాత కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. హీరో ఎంపిక పూర్తైన వెంటనే సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.
ఛలో, భీష్మ సినిమాలు తనకు సక్సెస్‌లు అందించిన ఎంటర్టైన్మెంట్ జోన్లోనే తర్వాతి సినిమా చేయాలని వెంకీ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనే ఉద్దేశంతో రాబిన్‌హుడ్ విషయంలో తనకు అలవాటైన శైలికి భిన్నంగా వెళ్లానని, ఆ సినిమా రిజల్ట్ కు తానే బాధ్యత వహిస్తానని చెబుతున్న వెంకీ.. ఈసారి మాత్రం తన స్ట్రాంగ్ జానర్లోనే ఆడియన్స్ ముందుకు రావాలని చూస్తున్నాడు. కథపై పూర్తి నమ్మకంతో ఉన్న ఆయన, నెక్ట్స్ మూవీతో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలనే టార్గెట్ గా అడుగులు వేస్తున్నాడు.








