కొరియన్ వెబ్ సిరీస్ రీమేక్ హక్కులని పొందిన గురు ఫిల్మ్స్
ఈ మధ్య వివిధ భాషలలోని మంచి కంటెంట్ ఉన్న సినిమాలని రీమేక్ చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సందర్భంలో వచ్చిన సినిమానే సమంత లీడ్ రోల్ లో నటించిన ” ఓహ్ బేబీ ” సినిమా. డిఫరెంట్ లైన్ అప్ తో వచ్చిన ఈ సినిమా మిస్ గ్రానీ అనే కొరియన్ సినిమాకి రీమేక్. నిర్మాత తాటి సునీత గురు ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ” బంగారు కోడిపెట్ట, సాహసమే శ్వాసగా సాగిపో, కొరియర్ బాయ్ కళ్యాణ్ ” వంటి హిట్ సినిమాలు ఈ బ్యానర్ లో వచ్చిన సంగతి తెలిసిందే. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ నిర్మాణ సంస్థ నుండి వచ్చిన ఓహ్ బేబీ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సామ్ కెరీర్ లో కూడా ఇది ఒక యూనిక్ సినిమాగా నిలిచిపోయింది అని చెప్పొచ్చు. ఇక రీసెంట్ గా ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి మరొక రీమేక్ రాబోతుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. కొరియన్ లో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న” ది గుడ్ డాక్టర్ ” అనే కొరియన్ వెబ్ సిరీస్ ని ఇప్పుడు గురు ఫిల్మ్స్ ప్రొడక్షన్ లో తెలుగులో రీమేక్ చేస్తున్నారని సమాచారం. రీసెంట్ గా ఈ వెబ్ సిరీస్ హక్కులను గురు ఫిల్మ్స్ సొంతం చేసుకుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
రీమక్స్ తో సూపర్ హిట్స్ కొడుతూ ఈ నిర్మాణ సంస్థ ఇండస్ట్రీలో దూసుకుపోతోందని చెప్పాలి. రీసెంట్ గా ” సాకిని డాకిని ” అనే సినిమాతో ప్రేక్షకులని ఆకట్టుకుంది గురు ఫిల్మ్స్. ఈ సినిమా కూడా మిడ్ నైట్ రన్నర్స్ అనే కొరియన్ డ్రామా కి రీమేక్. గ్లామరస్ హీరోయిన్ రెజినా కాసాండ్రా, నివేత పేతురాజ్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ ని పోషించారు. ప్రస్తుతం రాబోతున్న ” ది గుడ్ డాక్టర్ ” వెబ్ సిరీస్ ఆద్యంతం మెడికల్ ఇష్యూష్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఆల్రెడీ జపాన్, ఇంగ్లీష్ భాషలలో రీమేక్ అయి ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయని మేకర్స్ తెలిపారు. ఇక పలు భాషలలో హిట్టైన ఈ వెబ్ సిరీస్ తెలుగు ఆడియన్స్ ని ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.













