హీరోగా కాదు.. డైరెక్టర్‌గా కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’పై పెరుగుతున్న ఆసక్తి!
కిరణ్ అబ్బవరం(kiran abbavaram) కొత్త సినిమా రియాలిటీ(reality)పై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రమంగా పెరుగుతోంది. హీరోగా ఇప్పటికే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కిరణ్.. ఈ సినిమాతో డైరెక్టర్ గానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రీసెంట్ గా రిలీజైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచింది. భారీ యాక్షన్, విజువల్ హంగులకు దూరంగా.. నేచురల్ ఎమోషన్స్ తో రూపొందిన కంటెంట్‌కు గ్లింప్స్‌లో ప్రాధాన్యం ఇవ్వడం ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఈ సినిమాపై డిస్కషన్ మొదలైంది.
ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో కనిపించే సాధారణ అనుభూతులను స్క్రీన్ పై చూపించే ప్రయత్నం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రోజువారీ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు, పరిస్థితులు, ఎమోషన్స్ గ్లింప్స్‌లో కనిపించడంతో ఇదొక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా కాలం తర్వాత ఎలాంటి హంగామా లేకుండా మనసుకు హత్తుకునే కథను చూడబోతున్నామనే ఫీలింగ్ ఆడియన్స్ లో కలిగిందనే టాక్ వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఇక ఈ సినిమాకు కిరణ్ అబ్బవరం స్వయంగా కథను నడిపించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం మరో స్పెషాలిటీగా మారింది. ఒక రెగ్యులర్ పాయింట్‌ను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా మలచడంలో కిరణ్ ఎంచుకున్న విధానం ప్రశంసల్ని అందుకుంటోంది. హీరోగా మాత్రమే కాకుండా రైటర్, డైరెక్టర్ గా కిరణ్‌లోని మరో యాంగిల్‌ను రియాలిటీ పరిచయం చేసే అవకాశం కనిపిస్తోంది. గ్లింప్స్‌కు వచ్చిన రెస్పాన్స్ ను బట్టి చూస్తే.. ఈ సినిమా రిలీజ్ కు ముందే తనకంటూ ప్రత్యేకమైన ఆసక్తిని క్రియేట్ చేసుకుంటున్నట్టే కనిపిస్తోంది.








