చాణక్యలో మ్యాచో లుక్ విడుదల
హీరో గోపిచంద్ నటిస్తోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్ చాణక్య. రీసెంట్గా గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు గోపిచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ను విడుదల చేశారు. గోపీచంద్ మొహరీన్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని తిరు తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ నెలాఖరుకి టాకీ పార్ట్ పూర్తవుతుంది. మూడు పాటలు మాత్రమే మిగిలి ఉంటాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.













