మెగాస్టార్‌ను కలిసిన గంటా
మెగాస్టార్ చిరంజీవిని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిశారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా గంటా పంచుకున్నారు. సైరా చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో అన్నయ్య చిరంజీవిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా అన్నయ్యకు శుభాకాంక్షలు తెలియజేశానని చెప్పారు. వెండి తెరపై తొలి స్వాతంత్య్ర సమరయోధుడి చరిత్రను చూపించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. మరోవైపు సైరా చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. హిందీ వెర్షన్ కూడా భారీ వసూళ్లను రాబడుతోంది.













