కూలీలో ఆ టాలెంటెడ్ నటుడు
జైలర్ సినిమాతో మంచి హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఆ సక్సెస్ ఇచ్చిన జోష్ లో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో వేట్టయాన్ సినిమా చేస్తున్నాడు రజినీకాంత్. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా తర్వాత రజినీ, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. కూలీ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ ఓ పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడని టాక్. ఇప్పటికే లోకేష్ సినిమా అయిన విక్రమ్ లో ఫహాద్ అదిరిపోయే పాత్రలో కనిపించి అందర్నీ మెప్పించాడు. ఇప్పుడు కూలీ లో కూడా మరోసారి అలాంటి పాత్రలో ఫహాద్ అదరగొట్టనున్నాడంటున్నారు. వచ్చే నెలలో కూలీ షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. రజినీ కూతురి పాత్రలో శృతి నటిస్తుందని తెలుస్తోంది. కమల్ హాసన్ కూడా కూలీలో కామియో చేస్తాడని టాక్ వినిపిస్తోంది.













