కెమెరామేన్ అల్లెన్ డీవియో ఇక లేరు
కరోనా వైరస్ కారణంగా ఇటీవలే పలువురు హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు మరణించారు. తాజాగా ప్రఖ్యాత హాలీవుడ్ కెమెరామేన్ అల్లేన్ డీవియో (77) కరోనా వల్ల మరణించారు. ఈటీ, డి కలర్ పర్పుల్, ఎంపైర్ ఆఫ్ డి సన్ వంటి పాపులర్ సినిమాలకు కెమెరామేన్‌గా పని చేశారాయన. దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్‌తో ఎక్కువ సినిమాలు కలిసి పని చేశారు అల్లెన్. ఉత్తమ సినిమాటో గ్రఫీ విభాగంలో ఐదు సార్లు ఆస్కార్ నామినేషన్ పొందారు అల్లెన్ డేవియో. 2007లో అమెరికన్ సినిమాటో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆయనకు జీవిత సాఫలత్య పురస్కారాన్ని అందించింది.













