ఎర్రచీర ప్రారంభం
సుమన్‌బాబు, కారుణ్య, కమల్ కామరాజు భానుశ్రీ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం ఎర్రచీర. మహానటి ఫేమ్ బేబీ తుషిత కీలక పాత్ర చేస్తోంది. చెరువుపల్లి సుమన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. దర్శక నిర్మాత మాట్లాడుతూ కుటుంబ బాంధవ్యాలకి, అనురాగాలకి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. సంపూర్ణ కుటుంబ కథా చిత్రంగా మెప్పిస్తుంది. వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రమోద్ స్వరాలు ప్రధాన బలం. రెండు షెడ్యూళ్లలో చిత్రాన్ని పూర్తి చేస్తాం అన్నారు. రచయిత గోపీ మాట్లాడుతూ కుటుంబ కథే అయినా హారర్ థ్రిల్లింగ్ అంశాల్ని కూడా మేళవించాం అన్నారు. అజయ్, ఉత్తేజ్, మహేష్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.













