Eesha Rebba: స్లీవ్‌లెస్ టాప్ లో ఈషా కాన్ఫిడెంట్ లుక్స్

తెలుగమ్మాయి ఈషా రెబ్బా(Eesha Rebba) గురించి ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ తో ఈషా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగమ్మాయి అయినప్పటికీ ఈషా అందాల ఆరబోత విషయంలో తగ్గేదేలే అంటూ స్కిన్ షో చేస్తుంటుందనే విషయం తెలిసిందే. త్రీ రోజెస్ సీజన్2(three roses season2) తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్న ఈషా తాజాగా తన ఇన్‌స్టాలో ఓ ఫోటో షేర్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ ఫోటోలో ఈషా బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ టాప్, బ్రౌన్ ట్రౌజర్స్ ధరించి కళ్లద్దాలు పెట్టుకుని లూజ్ హెయిర్ తో ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపించింది. ఈషా షేర్ చేసిన ఈ ఫోటోకు ఆమె ఫాలోవర్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.