నేషనల్ అవార్డుల్లో కల్కి 2898ఏడీకి డబుల్ సక్సెస్
ప్రభాస్(prabhas) హీరోగా తెరకెక్కిన కల్కి 2898ఏడీ(Kalki 2898AD) మరో ప్రతిష్ఠాత్మక సక్సెస్ ను సొంతం చేసుకుంది. 2024 సంవత్సరానికి అనౌన్స్ చేసిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ సినిమా బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో అవార్డు దక్కించుకుంది. ప్రేక్షకాదరణతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ ను అందించిన సినిమాగా ఈ గుర్తింపు రావడం విశేషం. అంతేకాకుండా బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో కూడా నేషనల్ అవార్డు గెలుచుకోవడం ద్వారా ఈ సినిమా టెక్నికల్ క్వాలిటీని మరోసారి చాటుకుంది.
డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో, వైజయంతి మూవీస్(Vyjayanthi Movies) నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా భారతీయ పురాణాల ఆలోచనలను ఫ్యూచర్ సైన్స్ ఫిక్షన్ ప్రపంచంతో మేళవిస్తూ ప్రత్యేకమైన సినీ అనుభూతిని అందించింది. విజువల్ ప్రెజెంటేషన్, భారీ స్థాయి ప్రపంచ నిర్మాణం, కథనంలో ఉన్న వైవిధ్యం ఆడియన్స్ ను ఆకట్టుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. థియేటర్లలో భారీ సక్సెస్ ను నమోదు చేసిన ఈ సినిమా ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ తన టాలెంట్ ను నిరూపించుకుంది.
ముఖ్యంగా ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో నితిన్ జిహానీ చౌదరి(NIthin Jihaanee Chaudhary) చేసిన పనితనానికి ఈ అవార్డు దక్కడం చిత్ర బృందానికి మరింత గర్వకారణంగా నిలిచింది. కాశీ నగర నిర్మాణం నుంచి భవిష్యత్ ప్రపంచానికి సంబంధించిన సెట్ల రూపకల్పన వరకు ప్రతి అంశంలో చూపిన శ్రద్ధ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ రెండు జాతీయ అవార్డులు ఈ సినిమాను కేవలం కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా మాత్రమే కాకుండా, కంటెంట్ మరియు టెక్నికల్ వాల్యూస్ పరంగా కూడా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన సినిమాగా నిలబెట్టాయి.








