కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” సినిమా ట్రైలర్ రిలీజ్
-గ్లింప్స్ రిలీజ్ నుంచే “చెన్నై లవ్ స్టోరీ”కి అభిమానిగా మారాను – ప్రొడ్యూసర్ రవిశంకర్
-ట్రైలర్ చూస్తుంటే “చెన్నై లవ్ స్టోరీ” తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం కలుగుతోంది – ప్రొడ్యూసర్ అల్లు అరవింద్
-ట్రైలర్ లో మీరు చూసింది తక్కువే, సినిమాలో ఎన్నో సర్ ప్రైజ్ లు ఉంటాయి – డైరెక్టర్ రవి నంబూరి
-“చెన్నై లవ్ స్టోరీ”లో కిరణ్, గౌరి పర్ ఫార్మెన్స్ చూస్తూ రోజూ మురిసిపోతున్నాం – స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్
-“చెన్నై లవ్ స్టోరీ” ఒక ప్యూర్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ – హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ
-మా అందరి జీవితాల్లో “చెన్నై లవ్ స్టోరీ” ఒక పెద్ద విజయాన్ని అందించబోతోంది – కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని
-“చెన్నై లవ్ స్టోరీ” ట్రైలర్ కు వంద రెట్లు సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, నాది గ్యారెంటీ – ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్
-నా అభిమానులంతా గర్వపడే సినిమా “చెన్నై లవ్ స్టోరీ” – హీరో కిరణ్ అబ్బవరం
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా “చెన్నై లవ్ స్టోరీ”. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు “చెన్నై లవ్ స్టోరీ” మూవీ రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ అతిథులుగా పాల్గొన్నారు. అల్లు అరవింద్ చేతుల మీదుగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ రవిశంకర్ బర్త్ డే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా
నటుడు మహేందర్ మాట్లాడుతూ – మా “చెన్నై లవ్ స్టోరీ” సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. సరిగ్గా ఏడాది కిందట ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాం. ఈ నెల 24న మీ ముందుకు రాబోతున్నాం. మీరంతా మా సినిమాను థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
నటి సిరి హన్మంతు మాట్లాడుతూ – “చెన్నై లవ్ స్టోరీ” సినిమా ట్రైలర్ అదిరిపోయింది కదా. సినిమా కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంతో మా ప్రొడ్యూసర్స్ మరో కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. ఈ సినిమాకు షూటింగ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. పిక్నిక్ వెళ్లినంత సరదాగా షూటింగ్ చేశాం. అన్నారు.
నటుడు నరేష్ మాట్లాడుతూ – మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రేమ కథను “చెన్నై లవ్ స్టోరీ” లో చూస్తారు. థియేటర్స్ నుంచి బయటకు వెళ్లాక మీరు పది మందికి చెప్పుకునేలా మూవీ ఉంటుంది. నాకు ఈ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. అన్నారు.
నటి పూజ మాట్లాడుతూ – మా “చెన్నై లవ్ స్టోరీ” ట్రైలర్ నచ్చింది కదా, ఈ నెల 24న సినిమా చూసేందుకు థియేటర్స్ కు వచ్చేయండి. ఒక మంచి సపోర్టింగ్, ఎంకరేజింగ్ టీమ్ ఈ సినిమాకు వర్క్ చేసింది. ఇలాంటి టీమ్ తో కలిసి పనిచేయడం మర్చిపోలేని ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. అన్నారు.
నటుడు నవీన్ మాట్లాడుతూ – ఈ సినిమాలో నటిస్తున్న క్రమంలో మేమంతా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. కిరణ్ అన్న మా అందరికీ మంచి పార్టీ ఇచ్చారు. ఈ సినిమా చూశాక కిరణ్, గౌరిని మీరంతా మీ మనసులో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లిపోతారు. అది నా గ్యారెంటీ. అన్నారు.
ప్రొడ్యూసర్ రవిశంకర్ మాట్లాడుతూ – ఎఎఎ మల్టీప్లెక్స్ లో ఈవెంట్ చేస్తున్న ఈ టైమ్ లో మా పుష్ప 2 సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయనే న్యూస్ తెలియడం హ్యాపీగా ఉంది. చెన్నై లవ్ స్టోరీ సినిమా గ్లింప్స్ రిలీజైనప్పటి నుంచి ప్రతి ఒక్కరిలో క్రేజ్ ఏర్పడింది. నేను కూడా అందరిలాగే ఈ సినిమాకు అభిమానిని అయ్యాను. ఈ మూవీ నుంచి ఏ కంటెట్ రిలీజ్ చేసినా అది మంచి రీచ్ తెచ్చుకుంది. ఈ సినిమా కల్ట్ బ్లాక్ బస్టర్ అని మేకర్స్ చెబుతున్నారంటే అది వారికి మూవీ కంటెంట్ మీద ఉన్న నమ్మకం. నానిని నేచురల్ స్టార్ అని పిలుస్తాం. అలాగే కిరణ్ ను ఒరిజినల్ స్టార్ అని పిలవాలని ఉంది. మా బ్యానర్ లో నెక్ట్స్ కిరణ్ చేయబోయే సినిమాలో ఒరిజినల్ స్టార్ అని వేస్తాం. ఎక్కడా ఫేక్ అనిపించనంత మంచి పర్ ఫార్మెన్స్ చేస్తారు కిరణ్. ఆయన ఈ సినిమా తర్వాత మరింత బిజీ హీరో కావాలి. శ్రీ గౌరి ప్రియ తన నటనతో ఆకట్టుకోబోతోంది. ఈ సినిమా మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేష్, కో ప్రొడ్యూసర్ ధీరజ్, డైరెక్టర్ రవి… అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ – మనం ఈ సినిమా ట్రైలర్ చూస్తే, అందులోని భావోద్వేగాలు గమనిస్తే ఇది డెఫనెట్ గా హిట్ అయ్యే సినిమా అనే ఇంప్రెషన్ కలుగుతోంది. అందులో అనుమానమేమీ లేదు. ట్రైలర్ సూపర్బ్ గా ఉంది. రిలీజ్ ముందే సినిమా కల్ట్ క్లాసిక్ అని వేశారంటి అని అనిపించింది. కానీ ట్రైలర్ చూశాక ఇది తప్పకుండా అలాంటి విజయం సాధిస్తుందనే నమ్మకం ఏర్పడింది. ఈ టీమ్ లోని సాయి రాజేష్, ఎస్ కేఎన్, కిరణ్, శ్రీ గౌరి, డైరెక్టర్ రవి, ధీరజ్..వీళ్లంతా నాకు బాగా తెలిసినవాళ్లు. రవి నంబూరిలోని టాలెంట్ ను ఎస్ కేఎన్, సాయి రాజేష్ త్వరగా గుర్తించి, నాతో ఒక వెబ్ సిరీస్ కూడా చేయించారు. ఈ నెల 24న ఈ టీమ్ అందరికీ ఒక మంచి విజయం దక్కబోతోంది. వీళ్లందరికీ మంచి గుర్తింపు దక్కుతాయి. మైత్రీ రవి గారు ఈ సినిమాకు ఎంతో సపోర్ట్ చేశారు. కిరణ్ ఎంతో నేచురల్ గా పర్ ఫార్మ్ చేస్తారు. తనొక హీరో అన్నట్లు ఎక్కడా మనతో బిహేవ్ చేయడు. అందరితో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడు. కిరణ్ ఇప్పటికే తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఫ్యూచర్ లో ఇంకా మంచి పొజిషన్ కు వెళ్తాడు. ఈ సినిమాను 104 రోజుల్లో రూపొందించారంటే ఎంత క్వాలిటీగా చేశారో అర్థమవుతోంది. ఈ సినిమాను నచ్చేదాకా తీశారు. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ – కిరణ్ అన్నకు ఒరిజినల్ స్టార్ అనేది పర్పెక్ట్ ట్యాగ్. ఇప్పటిదాకా ఈ సినిమా వర్క్స్ లో ఒత్తిడిలో ఉన్నా. ఇప్పుడు వర్క్ కంప్లీట్ అయ్యిది. ఓవర్సీస్ కు కూడా పంపిస్తున్నాం. ఈ మూవీ మేకింగ్ టైమ్ లో నాపై ఉన్న ఒత్తిడి ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఇంత డబ్బు ఖర్చు పెట్టారు. హీరో హీరోయిన్స్ నన్ను నమ్మి వంద రోజులు వర్క్ చేశారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అనే తపన పడ్డాను. క్లైమాక్స్ షూట్ బాగా చేయాలని ప్లాన్ చేశాను. తలపై ఇరుముడి మోసే భక్తుడు, మొక్కు చెల్లించిన తర్వాత ఇరుముడి దించుకుంటే ఎంత తేలికగా ఉంటుందో ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ కంప్లీట్ పూర్తి చేశాక అలాంటి ఫీలింగ్ కలిగింది. ట్రైలర్ మీకు నచ్చితే సినిమా రెండింతలు నచ్చుతుంది. ట్రైలర్ లో మేము చూపించిన కంటెంట్ చాలా తక్కువ. సినిమాలో చాలా సర్ ప్రైజెస్ ఉంటాయి. అవన్నీ థియేటర్ లో చూసి షాక్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు.
హీరో త్రిగుణ్ మాట్లాడుతూ – చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ అదిరిపోయింది. డైరెక్టర్ సాయి రాజేష్ ఎప్పుడూ కొత్త తరహా లవ్ స్టోరీస్ రాస్తారు. రవి నంబూరి ఈ సినిమా తర్వాత డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకుంటాడు. ఎస్ కేఎన్ లాంటి ప్రొడ్యూసర్ దొరకడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలోకి నేను ఇంపాక్ట్ ప్లేయర్ లా వచ్చాను. ఇంపాక్ట్ క్రియేట్ చేశానా లేదా అనేది మీరు సినిమా చూసి చెప్పాలి. రాజా వారు రాణి గారు సినిమా నుంచే నాకు కిరణ్ తెలుసు. అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉన్నారు. చెన్నై లవ్ స్టోరీ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ మాట్లాడుతూ – “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు అన్నీ అనుకున్నట్లు జరగాలని ప్లాన్ చేశాం. మధ్యలో చిన్న లో ఫీల్ కలిగింది. అయితే రీసెంట్ గా ఇండస్ట్రీలోని కొందరు సినిమా చూశారు. మూవీ చాలా బాగుందంటూ మా డైరెక్టర్ రవి నంబూరిని అప్రిషియేట్ చేశారు. దాంతో హ్యాపీగా అనిపించింది. మనసు ప్రశాంతంగా మారింది. ఈ సినిమాకు ట్రైలర్ కట్ చేయడం కష్టం. స్టోరీ రివీల్ చేయకుండా ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్ కట్ చేసిన సుధాన్ కు థ్యాంక్స్. ఈ చిత్రంలో త్రిగుణ్ ఒక ఇంట్రెస్టింగ్, సర్ ప్రైజ్ క్యారెక్టర్ చేశాడు. ఈ కథ రాసినప్పుడే త్రిగుణ్ ను అనుకున్నాం. ఆయనకు ఈ మధ్య ఒక హిట్ వచ్చింది. ఈ క్యారెక్టర్ కు అడగొచ్చా లేదా అని సందేహించాం. మేము అడగగానే నా మీద ఇష్టంతో ఈ సినిమా చేశాడు. మా హీరో కిరణ్, హీరోయిన్ గౌరి, మా ఇతర కాస్ట్ అందరికీ థ్యాంక్స్. కిరణ్ గారు, గౌరి ఈ సినిమాలో యాక్ట్ చేసి వెళ్లిపోయారు. ఆ కంటెంట్ చూసి రోజూ మేము మురిసిపోతున్నాం. ఇద్దరూ బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. మా సినిమా మీ అందరికీ త్వరగా చూపించాలని వెయిట్ చేస్తున్నాం. అన్నారు.
హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ – అరవింద్ గారు మా మూవీ ట్రైలర్ లాంఛ్ కు రావడం హ్యాపీగా ఉంది. నామొదటి మూవీ మెయిల్ ఆహాలో ప్రొడ్యూస్ అయ్యింది. మైత్రి రవి గారు మా మూవీ పూజా కార్యక్రమాలకు వచ్చారు. ఇప్పుడు ట్రైలర్ లాంఛ్ లో పాల్గొన్నారు. ఆయనకు బర్త్ డే విశెస్ చెబుతున్నా. చెన్నై లవ్ స్టోరీ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. స్వచ్ఛమైన ప్రేమ కథ. కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ కూడా. ఈ సినిమాకు ట్రైలర్ కట్ చేయడం నిజంగా కష్టమే. ఈ సినిమాలో కొన్ని పాయింట్స్ ట్రైలర్ లో చెప్పకుండా ఎలా చెబుతారు అనే క్యూరియాసిటీ నాలోనూ ఉండేది. ట్రైలర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. ట్రైలర్ కు డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఎంజాయ్ చేశాను. ఎక్కడ ఏ ట్విస్ట్ ఉందో నాకు తెలుసు. ఇప్పటిదాకా మన సినిమా పాటలనే విన్నాం. ఇప్పుడు ట్రైలర్ లో మాటలు మీకు నచ్చాయని నమ్ముతున్నాం. ఈ సినిమాలో చాలా ట్విస్ట్ లు, సస్పెన్స్ లు, సర్ ప్రైజ్ లు దాచాం. అవన్నీ థియేటర్ లో చూద్దాం. అన్నారు.
కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – చెన్నై లవ్ స్టోరీ సినిమాను ఇటీవల కొంతమంది పెద్దవాళ్లు చూశారు. వాళ్లు మళ్లీ కల్ట్ బ్లాక బస్టర్ చేశారంటూ చెప్పారు. వాళ్ల మాటలతో మేమంతా చాలా హ్యాపీగా ఫీలయ్యాం. ఇలాంటి ప్రేమకథ ఇప్పటిదాకా రాలేదు. మా అందరి జీవితాల్లో పెద్ద విజయాన్ని ఈ సినిమాతో అందుకోబోతున్నాం. కిరణ్ గారు ఈ సినిమాకు ప్రాణం పెట్టి నటించారు. ఆయన కెరీర్ లో ఈ సినిమా పీక్ లో ఉంటుంది. మా బేబి మూవీ ట్రైలర్ కూడా ఇక్కడే ఇదే థియేటర్ లో రిలీజ్ చేశాం. మా చెన్నై లవ్ స్టోరీ సినిమాను ఈనెల 24న థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – మా బేబి సినిమా ట్రైలర్ ఇక్కడే రిలీజ్ చేసుకున్నాం. మళ్లీ ఇదే మల్టీప్లెక్స్ లో మా చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ రిలీజ్ చేసుకోవడం పాజిటివ్ ఎనర్జీ ఇస్తోంది. ఈ ట్రైలర్ ను మీకు అందంగా అందించాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాం. నాకు ప్రొడ్యూసర్ గా కల్ట్ స్టేటస్ ఇచ్చింది నా స్నేహితుడు సాయి రాజేష్. ఈ హోదా క్రెడిట్ అంతా ఆయనకే సొంతం. కిరణ్ గారు ఈ కథ విని పది నెలలుగా ఇదే ప్రాజెక్ట్ మీద డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారంటే ఆయనకు మా స్క్రిప్ట్ ఎంత నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. జూలై 24న నాకు స్పెషల్ డే. ఆ రోజునే ఇంద్ర, తొలిప్రేమ సినిమాలను ఎంజాయ్ చేశాను. అదే డేట్ కు నా సినిమా చెన్నై లవ్ స్టోరీ కూడా రిలీజ్ కు వస్తుండటం సంతోషంగా ఉంది. కిరణ్ గారి అభిమానులంతా సంతోషించేలా సినిమా ఉంటుంది. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేసే క్రమంలో మాకు దొరికిన డైమండ్ శ్రీ గౌరి ప్రియ. మా ట్రైలర్ కు వంద రెట్లు ఇంట్రెస్టింగ్ గా సినిమా ఉంటుంది నాది గ్యారెంటీ. ఈ నెల 23వ తేదీ సాయంత్రం నుంచే మనమంతా మూవీని థియేటర్స్ లో ఎంజాయ్ చేయడం మొదలుపెడతాం. కిరణ్ గారి అన్ని సినిమాల్లో ఈ సినిమా ఒక ఎవరెస్ట్ లా నిలబడిపోతుంది. ఈ సినిమా కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ అవుతుంది. అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – మీ అందరికీ మాటిస్తున్నా చెన్నై లవ్ స్టోరీతో మనం హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. మా మూవీ నుంచి ఏ ఈవెంట్ పెట్టినా చాలా పాజిటివ్ గా , ఎనర్జీగా జరుగుతోంది. మా ప్రొడ్యూసర్స్ ప్రమోషన్ లో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఈ సినిమా ట్రైలర్ కట్ చేయడం కష్టం. ట్రైలర్ కట్ లేకుండా డైరెక్ట్ గా ఈ నెల 23 నుంచే ప్రీమియర్స్ తో సినిమా వేయండి, మన సినిమాకు ప్రేక్షకులు తప్పకుండా వస్తారని మా ప్రొడ్యూసర్స్ తో చెప్పాను. మా మూవీ కంటెంట్ మీద అంత నమ్మకంతో ఉన్నాను. నేను మాట ఇస్తున్నా. టికెట్ బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభమైనా మీరు టికెట్ బుక్ చేసుకోండి. ఎప్పుడూ తెరపై చూడని ఒక కొత్త ప్రేమ కథను మా సినిమాలో చూస్తారు. సినిమా చూసి బయటకు వచ్చాక మా మూవీ ట్రాన్స్ లోనే ఉండిపోతారు. నేను ఈ సినిమా చేసినందుకు నా అభిమానులంతా గర్వంగా ఫీలవుతారు. ఈ కథ విన్నప్పుడే మ్యాజిక్ జరుగుతుందని నమ్మాను. షూటింగ్ లోనూ అదే మ్యాజిక్ ఫీలయ్యాను. ఇప్పుడు రిలీజ్ టైమ్ లోనూ అదే మ్యాజిక్ ఎక్సిపీరియన్స్ చేస్తున్నాను. మా మూవీకి చేసిన లాస్ట్ షాట్ లో మ్యాజిక్ స్టార్ట్స్ అని ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా, మా సినిమా చూస్తూ ఇంత బాగుందేంట్రా సినిమా అనుకుంటారు. అన్నారు.








