టాక్సిక్ ట్రైలర్‌కు కౌంట్‌డౌన్?
కన్నడ స్టార్ యష్(Yash) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్(Toxic) రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొల్పుతోంది. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్(Geethu mohandas) రూపొందిస్తున్న ఈ సినిమాలో యష్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం సాగుతోంది. రుక్మిణి వసంత్(Rukmini vasanth), నయనతార(nayanthara), కియారా అద్వానీ(Kiara Advani), హుమా ఖురేషి(Huma Qureshi), తారా సుతారియా(Tara Sutaria) వంటి స్టార్ నటీమణులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ ను రాబట్టగా, ఇప్పుడందరి దృష్టి ట్రైలర్‌పైనే నిలిచింది.
తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం టాక్సిక్ ట్రైలర్‌ను ఆగస్టు 8న రిలీజ్ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ట్రైలర్ రిలీజ్ డేట్ పై చర్చ జోరుగా సాగుతోంది. సినిమా రిలీజ్ కు ముందు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచేలా ట్రైలర్ ఉండబోతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కథలోని మెయిన్ కాన్ఫ్లిక్ట్తో పాటు యష్ పాత్రల వైవిధ్యాన్ని ఈ ట్రైలర్లో చూపించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
టెక్నికల్ గా కూడా ఈ సినిమా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా, విశాల్ మిశ్రా(Vishal mishra), తనిష్క్ బాగ్చి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. యష్‌తో కలిసి కేవీఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ట్రైలర్‌పై వస్తున్న ప్రచారానికి అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే, సినిమా ప్రమోషన్స్ మరింత వేగం అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభిమానులు కూడా ఈ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








