సమస్యల పరిష్కారానికి భేటీ అయిన.. సినీ ప్రముఖులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో టికెట్టు రేట్ల సమస్యలపైనా చర్చించేందుకు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందించారు. మంత్రి పేర్ని నాని నేరుగా చిరంజీవికి పోన్ చేసి ఆహ్వానించారు. అయితే ఈ భేటీలో ముఖ్యమంత్రికి విన్నవించాల్సిన అన్ని విషయాలపైనా కూలంకుశంగా చర్చించి వెళ్లాలన్న ఉద్దేశంతో హైదరాబాద్లోని చిరంజీవి నివాసంలో సినీ ప్రముఖుల సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఫిలిం చాంబర్ అధ్యక్షులు నారాయణ దాస్, నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఆర్.నారాయణమూర్తి, దిల్ రాజు కే.ఎస్.రామారావు, దామోదర్ ప్రసాద్, ఏషియన్ సునీల్, స్రవంతి రవికిశోర్, సి.కల్యాణ్, ఎన్వి. ప్రసాద్, కొరటాల శివ, వి.వి.వినాయక్, జెమిని కిరణ్, సుప్రియ భోగపల్లి బాబా యూవీ క్రియేషన్స్ విక్కీ వంశీ ఇలా నిర్మాతల సంఘం, పంపిణీ, ఎగ్జిబిషన్ రంగాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. చిన్న నిర్మాతల సమస్యలపైనా ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీలో చర్చించనున్నారు.













