ఆ రెండు సినిమాలు పక్కనపెట్టి ‘చిత్రం’ సీక్వెల్ చేద్దామనుకున్న తేజకు ఓ షాక్ తగిలింది!
వరస పరాజయాలతో కెరీర్‌ను కొనసాగిస్తున్న తేజ నేనేరాజు నేనే మంత్రితో మరో సూపర్‌హిట్ అందుకున్నాడు. ఇక హిట్ ట్రాక్‌లో పడినట్టే అనుకుంటున్న తరుణంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌తో చేసిన సీత డిజాస్టర్ అవ్వడంతో మరోసారి ఇరకాటంలో పడ్డాడు. ఇటీవల రెండు సినిమాలు రెండు సినిమాలు చెయ్యబోతున్నట్టు ప్రకటించాడు. ఒకటి అలిమేలు మంగ వెంకటరమణ, రెండు రాక్షసరాజు రావణుడు. ఈ రెండు సినిమాలకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రేపో మాపో షూటింగ్ వెళ్ళబోతున్న తరుణంలో కరోనా అడ్డుకట్ట వేసింది. దీంతో తేజకు ఏం చెయ్యాలో దిక్కు తోచలేదు. ప్రస్తుతం షూటింగులు చేసే పరిస్థితి లేకపోవడంతో అతనికి ఓ కొత్త ఆలోచన వచ్చింది. తేజ దర్శకుడిగా చేసిన మొదటి సినిమా `చిత్రం` 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సినిమా 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా `చిత్రం`కు సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు. తను అనుకున్న రెండు సినిమాలను పక్కన పెట్టి ముందుగా ఈ సీక్వెల్ చెయ్యడానికి డిసైడ్ అయ్యాడు తేజ.
ఆలోచన వచ్చిందే తడవుగా ఏర్పాట్లు మొదలు పెట్టేశాడు. అంతా కొత్తవారితో మినిమం బడ్జెట్లో చిత్రం సీక్వెల్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల ఆన్లైల్ ఇంటర్వూలో నటీనటులను ఎంపిక చేశాడు. తేజ ఆల్‌లైన్‌లో నటీనటుల కోసం ఇంటర్వూలు చేస్తున్నాడని తెలియగానే అలిమేలు మంగ వెంకటరమణ, రాక్షసరాజు రావణుడు సినిమాల కోసం అని అందరూ అనుకున్నారు. కానీ, చిత్రం సీక్వెల్ కోసం ఆ ఇంటర్వూలు చేశాడని తర్వాత తెలిసింది. ఈ సీక్వెల్‌కి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే సినిమాను పూర్తి చేసి ఓటీటీలో రిలీజ్ చెయ్యబోతున్నాడు. ఓటీటీలో రిలీజ్ చేస్తే సెన్సార్ సమస్య కూడా ఉండదు కాబట్టి మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను చెయ్యబోతున్నాడు.
తేజ చేసుకుంటున్న ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఈరోజు అంటే ఆగస్ట్ 3న ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేమిటంటే తేజకు కరోనా పాజిటివ్ అని. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందట. అతను ఏ సినిమా చేద్దామని ప్లాన్ చేస్తున్నా ఏదో ఒక అడ్డంకి వచ్చి పడుతోంది. ఇక తేజ కరోనా నుంచి కోలుకొనేదాకా చిత్రం సీక్వెల్ కూడా పక్కన పెట్టినట్టే.













