ప్రభాస్ మూవీలో వర్మ?
ఎట్ ఎ టైమ్ మూడు ప్యాన్ ఇండియన్ సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి, క్షణం కూడా ఖాళీగా లేకుండా గడుపుతున్న ప్రభాస్ ని, ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆదిపురుష్ మీద ఫ్యాన్స్ కి ఉన్న అంచనాలన్నీ, ఎప్పటికప్పుడు టీమ్ పోగొడుతూ వస్తుంది. ఆ తర్వాత జనవరిలో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ కె అసలు ఆ టైమ్ కి రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ని కలవరపెడుతున్నాయి.
ఒకవేళ ప్రాజెక్ట్ కె సంక్రాంతికి రాకపోతే, ఆ స్థానంలో ప్రభాస్- మారుతి సినిమా ఆ ప్లేస్ ని రీప్లేస్ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. గత నాలుగైదు నెలలుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ చిన్న క్యామియో చేశారనే వార్తలు నెట్టింట వినిపిస్తున్నాయి.
అన్నపూర్ణ స్టూడియోస్ లో స్పెషల్ గా వేసిన ఓ టెర్రస్ సెట్లో కీలక ఆర్టిస్ట్ లతో పాటూ, వర్మ కూడా ఆ సీన్ లో పాల్గొన్నారని తెలుస్తుంది. కాకపోతే ఆ ఎపిసోడ్ బాగా రాకపోవడంతో దాన్ని సినిమాలో ఉంచాలా వద్దా అనే డెసిషన్ ను పెండింగ్ లో పెట్టింది చిత్ర యూనిట్.
ఇదిలా ఉంటే అసలు ఈ క్యారెక్టర్ వర్మతోనే చేయించాలి అని మారుతి ఎందుకు అనుకున్నాడో ఫ్యాన్స్ కు అంతుపట్టడం లేదు. ఒకప్పుడు కల్ట్ డైరెక్టర్గా వర్మకు ఎంత పేరున్నా, గత కొన్నాళ్లుగా ఆయన సినిమాలు, ఆయన సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ కారణంగా ఆయన మీద విపరీతమైన నెగిటివిటీ ఉంది. ఈయన వల్ల సినిమాకు వచ్చే క్రేజ్ కూడా పెద్దగా ఉండదు. దీని గురించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇది రూమర్ గానే భావిస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.













