ఆ సినిమా చూడకుండానే నాని ఛాన్సిచ్చాడా?
దండోరా(Dandora) సినిమాతో డైరెక్టర్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మురళీకాంత్ దేవసోత్ (Muralikanth Devasoth) తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నితిన్(nithin) హీరోగా తెరకెక్కిన అలియాస్ రుక్మిణి(alias rukmini) సినిమాకు దర్శకత్వం వహించిన ఆయన, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన గత సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. హీరో నాని(Nani) ఇప్పటివరకు దండోరా సినిమాను చూడలేదని చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది. తన నెక్ట్స్ మూవీ ఛాన్స్ విషయంలోనూ ఆయన క్లారిటీనిచ్చారు.
దండోరాకు గద్దర్ అవార్డుల్లో గుర్తింపు లభించడానికి ముందే అలియాస్ రుక్మిణి ప్రాజెక్ట్ ఫిక్సైందని మురళీకాంత్ తెలిపారు. అవార్డుల గుర్తింపునకు, కొత్త సినిమా ఛాన్స్ కు సంబంధం లేదని ఆయన కామెంట్స్ ద్వారా స్పష్టమైంది. డైరెక్టర్ గా తన జర్నీలో దండోరా ఎంతో కీలకమైన సినిమా అని, పర్సనల్ గా తనకు మంచి రిజల్ట్ నుఇచ్చినప్పటికీ, నిర్మాతల విషయంలో మాత్రం ఆశించిన స్థాయి ఫలితం దక్కలేదని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఒక సినిమాకు లభించే ప్రశంసలు, పురస్కారాలు, కమర్షియల్ రిజల్ట్స్ మధ్య ఉండే వ్యత్యాసాన్ని మురళీకాంత్ వ్యాఖ్యలు మరోసారి చర్చలోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆయన తన దృష్టిని పూర్తిగా అలియాస్ రుక్మిణిపైనే పెట్టారు. నితిన్‌తో తెరకెక్కించనున్న ఈ సినిమా ద్వారా మురళీకాంత్ ఎలాంటి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. డైరెక్టర్ గా మొదటి సినిమాతో సంపాదించుకున్న గుర్తింపును తదుపరి సినిమాతో మరింత బలోపేతం చేసుకుంటారేమో చూడాలి.







