రణవీర్, దీపికల పెళ్లి వచ్చే ఏడాది
బాలీవుడ్ స్టార్ జంట రణవీర్ సింగ్, దీపిక పదుకునే ప్రేమ వివాహానికి అన్నీ అడ్డంకులే. ఏ ముహూర్తాన వీరి పెళ్లి విషయం బయటకు వచ్చిందో అప్పటి నుంచి వివాహం అంతకంతకు ఆలస్యమవుతూనే ఉంది. ఓ వైపు పెళ్లి ఏర్పాట్లు సాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఈ వివాహానికి మూహూర్తం కుదిరింది అని ప్రకటించలేని పరిస్థితి వారిది. ఈ నవంబర్లోనే పెళ్లి బాజా మోగుతుందని అభిమానులు అంతా భావించారు. కానీ ఇంతలోనే నిరాశ కలిగించే వార్త వచ్చింది. రణవీర్, దీపిలక పెళ్లి ఈ ఏడాది ఉండదు. వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందేనన్నది ఆ వార్త సారాంశం. వీరి పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చురుకుగానే సాగుతున్నా కొన్ని కారణాల వల్ల వివాహాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. నవంబర్ 20న రణవీర్, దీపికల పెళ్లి ఇటలీలోని లేక్ కోమోలో జరుగనుందని ఎప్పటినుంచో అంటున్నారు. అయితే అదె నెలలో వీరిద్దరూ తమ సినిమాలతో బిజీగా ఉంటారట. రణవీర్ ఇప్పటికే నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. అలాగే దీపిక సినిమాలు ఈవెంట్లతో ఆ నెలంతా బిజీగా గడుపుతుందట. దీంతో వచ్చే ఏడాది ఆరంభంలో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని రణవీర్, దీపికలు ఓ నిర్ణయానికి వచ్చారట.













