పెళ్లి పీటలు ఎక్కనున్న దీపికా, రణవీర్
బాలీవుడ్లో మరో భారీ వివాహ వేడుక జరగబోతోందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీపికా పదుకునే, రణవీర్‌సింగ్ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. (5) దీపిక పుట్టిన రోజు. ఆమె 32వ ఏట అడుగు పెడుతోంది. పుట్టిన రోజు వేడుకను సెలబ్రేట్ చేసుకోవడానికి వీరిద్దరూ ఇప్పటికే సీక్రెట్‌గా శ్రీలంకకు చేరుకున్నారు. ఈ వేడుకలోనే వీరిద్దరూ ఉంగరాలను మార్చుకోబోతున్నారని తెలుస్తోంది. నిశ్చితార్థం తరువాత మరి కొన్ని రోజుల్లోనే వివాహ వేడుక ఉంటుందని అంటోంది. గత ఐదు సంవత్సరాలుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. మరో వైపు, కొత్త సంవత్సరం వేడుకలను దీపిక, రణవీర్ మాల్దీవుల్లోని ఓ లగ్జరీ రిస్టార్ట్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. అక్కడి నుంచి వారి కుటుంబ సభ్యులతో కలసి శ్రీలంక చేరుకున్నారు.













