Daku Maharaj: అందరి దృష్టి డాకు ట్రైలర్ పైనే!
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా బాబీ కొల్లి(Bobby Kolli) దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్(Daku Maharaj) సినిమాపై ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆశలు పెట్టుకున్నారు. అయితే తమన్(Thaman) అందించిన సాంగ్స్ ఆడియన్స్ లోకి బాగా వెళ్లడం లేదనే అసంతృప్తి ఫ్యాన్స్ లో ఉన్నప్పటికీ రీసెంట్ గా వచ్చిన దబిడి దబిడి(Dabidi Dibidi) సాంగ్ వల్ల ఒక్కసారిగా సోషల్ మీడియా దృష్టంతా ఈ పాటవైపే మళ్లింది.
బాలయ్య(Balayya) వయసు, ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకోకుండా దీన్ని శేఖర్ మాస్టర్(Sekhar Master) కేవలం ఐటెం సాంగ్ తరహాలో కంపోజ్ చేయడం ఎవరికీ నచ్చకపోవడంతో నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. అయితే దీని గురించి పెద్దగా టెన్షన్ పడక్కర్లేదని యూనిట్ వర్గాలంటున్నాయి. దానికి కారణం ఇంకా డాకు మహారాజ్ ట్రైలర్(Daku Maharaj Trailer) రిలీజ్ కాలేదు.
ఈ సినిమా గురించి నిర్మాత నాగవంశీ(Naga Vamsi) ఎప్పటికప్పుడు నెక్ట్స్ లెవెల్ ఎలివేషన్స్ ఇస్తున్నాడు. దానికి తగ్గట్టే ట్రైలర్ ఉండబోతుందని, ట్రైలర్ రిలీజయ్యాక అప్పటివరకు సినిమాపై ఏదైనా నెగిటివిటీ ఉన్నా అది మొత్తం మాయమవుతుందని చిత్ర వర్గాలు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి డాకు మహారాజ్ ట్రైలర్ పైనే ఉంది.













