Daku Maharaj: అవసరం లేదనే ఆ పాత్రని తీసేశారట!
ఈ మధ్య పెద్ద సినిమాల్లో గెస్టు రోల్స్ ను సృష్టించి దాన్ని పేరున్న నటులతో చేయించడం ట్రెండ్ గా మారింది. ఈ నేపథ్యంలోనే డాకు మహారాజ్(Daku Maharaj) లో దుల్కర్ సల్మాన్(Dulquer Salman) తో ఓ స్పెషల్ రోల్ చేయిస్తున్నట్లు ఆ సినిమా షూటింగ్ మొదలైన టైమ్ లో వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ట్రైలర్ లో అలాంటి ప్రత్యేక పాత్ర ఏమీ కనిపించడం లేదు.
ఈ విషయాన్ని ఓ ఇంటవర్వ్యూలో డైరెక్టర్ బాబీ(Bobby)ని అడిగ్గా అసలు సీక్రెట్ను బయటపెట్టాడు. ముందు ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ను అనుకున్నట్టు, దాన్ని దుల్కర్ తో చేయించాలనుకున్న మాట కూడా నిజమే అని బాబీ తెలిపాడు. దుల్కర్ కూడా ఆ పాత్ర చేయడానికి సుముఖంగానే ఉన్నట్టు బాబీ చెప్పాడు.
కానీ ఆ స్పెషల్ రోల్ ను డెవలప్ చేశాక కథకు ఆ పాత్ర అవసరం లేదనిపించి ఆ పాత్రను కథ నుంచి తీసేసినట్టు బాబీ తెలిపాడు. అందుకే డాకు మహారాజ్ లో దుల్కర్ నటించలేదని కూడా బాబీ ఈ సందర్భంగా వెల్లడించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు తమన్(Thaman) సంగీతం అందిస్తున్నాడు.













