ఏజెంట్ నష్టాలను తీర్చనున్న భోళా శంకర్
అఖిల్ అక్కినేని ఏ ముహూర్తాన ఇండస్ట్రీకి వచ్చాడో కానీ ఇప్పటివరకు తన ఖాతాలో నిఖార్సయిన హిట్టు ఒకటి కూడా పడలేదు. మొదటి మూడు సినిమాలు డిజాస్టర్లు కాగా, నాలుగో సినిమా ఫర్వాలేదనిపించింది. దీంతో అఖిల్ పై 50 కోట్ల బడ్జెట్‌తో ఏజెంట్ అనే సినిమా తీస్తున్నట్లు అనౌన్స్ చేసి అనిల్ సుంకర అందరికీ షాకిచ్చాడు.
అఖిల్ మార్కెట్ తెలిసి కూడా ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ ఎలా పెడుతున్నారని అందరూ అన్నారు. కానీ ఈ సినిమాకు డైరెక్టర్ సురేందర్ రెడ్డి కావడం, అందులో మమ్ముట్టి కీలక పాత్ర చేయనుండటంతో సినిమాపై అందరికీ కాస్త నమ్మకమేర్పడింది. ఏజెంట్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని సదరు చిత్ర బృందంతో పాటూ అందరూ అనుకున్నారు.
కానీ సినిమా రిలీజ్ అయ్యాక అందరి ఆశలు అడియాశలయ్యాయి. బెనిఫిట్ షోలకే ఏజెంట్ రిజల్ట్ తెలియడంతో మార్నింగ్ షోలు కూడా సరిగా ఫుల్ అవలేదు. సినిమా స్టార్ట్ చేసినప్పుడు రూ.50 కోట్లు అనుకున్న బడ్జెట్ సినిమా రిలీజ్ నాటికి రూ.80 కోట్లయింది. కలెక్షన్లు క్లోజింగ్ టైమ్‌కి కూడా బడ్జెట్ లో పదోవంతు రాలేదు.
దీంతో నిర్మాత అనిల్‌కు బయ్యర్ల నుంచి ఒత్తడి పెరగడంతో తన తర్వాతి సినిమా భోళా శంకర్‌తో లింకు పెడుతున్నాడట. బయ్యర్లకు పరిహారానికి బదులు, భోళా శంకర్ రైట్స్ ను తక్కువ ధరకు ఇచ్చేలా సెటిల్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే అఖిల్ ద్వారా వచ్చిన నష్టాలను చిరూ ద్వారా తీర్చేయాలనుకుంటున్నాడన్నమాట సీనియర్ ప్రొడ్యూసర్ అనిల్.













