పుష్ప2 క్రేజ్‌కు భయపడుతున్న చావా
ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప2(Pushpa2) గురించే మాట్లాడుతున్నారు. ఇంకా సరిగ్గా ప్రమోషన్స్ మొదలు కూడా పెట్టలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా గురించి చాలా ఎక్కువగా ఫీలైపోతున్నారు. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ మొత్తం కలిసి రూ.1100 కోట్ల వరకు బిజినెస్ చేసిందనే వార్త ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచేస్తుంది.
తెలుగుటైమ్స్ (telugutimes.net) కొద్ది రోజుల ముందే చెప్పినట్లు పుష్ప2 ఒకరోజు ముందుగా అంటే డిసెంబర్ 5నే రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే పుష్ప2 కు ఉన్న క్రేజ్ ను చూసి బాలీవుడ్ భారీ పాన్ ఇండియన్ మూవీ చావా(Chhaava) చిత్ర యూనిట్ కు చెమటలు పడుతున్నట్లు నార్త్ బయర్లు చెప్తున్నారు. నార్త్ రాష్ట్రాల్లో చావాకు మంచి క్రేజ్ ఉంది.
అయినప్పటికీ పుష్ప2 హైప్ ముందు తట్టుకోగలమా అనే ఆలోచనలో నిర్మాతలున్నారట. సినిమా వాయిదా గురించి ఇంకా చెప్పలేదు కానీ ఒకవేళ పోస్ట్ పోన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పుష్ప2 ఆగస్ట్ లో వస్తుందని చెప్పినప్పుడు ఆ డేట్ కు రావాలనుకున్న సింగం అగైన్(Singam Again) వాయిదా పడింది. ఇప్పుడు చావాకు కూడా అదే సిట్యుయేషన్ వస్తుందని అందరూ అనుకుంటున్నారు. చూడాలి మరి చావా మేకర్స్ రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.













