అఘోరాగా నటిస్తున్న విషయం నిజమే అంటోన్న బోయపాటి
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కథలో పాత్రోచితంగా వచ్చే విభిన్నమైన గెట్అప్ వేయడానికి సిద్ధంగా వుంటారు ‘భైరవ ద్వీపం’ లో కురూపి పాత్రలో హీరోయిజమ్ పక్కన పెట్టి మరి కథను నడిపించారు. తన తదుపరి చిత్రంలో అఘోరా పాత్రలో కనిపించనున్నారని దర్శకుడు బోయపాటి శ్రీను అధికారికంగా వెల్లడించారు. ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలతో బాలకృష్ణను మాస్ అభిమానులకు బోయపాటి శ్రీను మరింత దగ్గర చేశారు. హాట్ట్రిక్ హిట్ మూవీ కోసం ప్రస్తుతం బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో ఇటీవల ప్రారంభమైన ఈసినిమా షూటింగ్‌ను కరోనా కారణంగా కొంతకాలం పాటు వాయిదా వేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర గురించి గత కొంత కాలం నుంచి వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రంలో బాలయ్య అఘోరాగా కనిపించనున్నారంటూ సినీ వర్గాలు చెప్పుకొచ్చాయి. కాగా, తాజాగా బాలయ్య సినిమా గురించి బోయపాటి మీడియాతో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల కంటే విభిన్నంగా ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులను అందించనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్య అఘోరా గెటప్‌లో కనిపించనున్నారని వస్తున్న వార్తలు నిజమేనని వెల్లడించారు. అయితే తప్పకుండా ఓ మంచి సినిమాని ప్రేక్షకులకు అందిస్తానని ఆయన వెల్లడించారు.













