తమ సినిమాలో ఎలాంటి పాత్ర లేదు
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోత్ను సినిమాలో సీనియర్ హీరోయిన్ భూమిక నెగెటివ్ పాత్రలో నటిస్తోందని పైగా ఆమె పాత్ర బాలయ్య పాత్రతో సమానంగా ఉంటుందని కూడా ప్రచారం జరిగింది. అయితే తమ సినిమాలో భూమిక నటించటం లేదని, ఆమె కోసం తన సినిమాలో ఎలాంటి పాత్ర లేదని బోయపాటి సృష్టం చేశారు. ఇక పెళ్లి తర్వాత కూడా భూమికా చావ్లా వరుస సినిమాల్లో నటిస్తోంది. బాలకృష్ణ రూలర్లో కూడా ఈ మాజీ హీరోయిన్ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య రెండు పాత్రల్లో కన్పించనున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి హీరోయిన్గా నటిస్తోంది.













