దుర్గావతి షూటింగ్ ప్రారంభం
దుర్గావతి ప్రయాణం మొదలైంది. భూమి ఫడ్నేకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం దుర్గావతి. తెలుగులో హిట్ సాధించిన అనుష్క భాగమతి (2018)చిత్రానికి ది హిందీ రీమేక్. అక్షయ్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో విక్రమ్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భాగమతి చిత్రానికి దర్శకత్వం వహించిన జి.అశోకే దుర్గావతి ని తెరకెక్కిస్తుండటం విశేషం. దర్శకుడిగా హిందీలో అశోక్‌కి ఇది తొలి చిత్రం. ఐపీఎస్ ఆఫీసర్‌గా భూమి ఫడ్నేకర్ నటిస్తోన్న ఈ చిత్రంలో మహీ గిల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. దుర్గామాత ఆశీర్వాదంతో దుర్గావతి చిత్రీకరణ మొదలైంది. నా కెరీర్లో ఓ ప్రత్యేకమైన సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశాను. టాల్ అండ్ స్ట్రాంగ్‌గా నిలబడటానికి నేను రెడీ అక్షయ్ సార్ అన్నారు భూమి. దర్గావతి చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విదుల చేయాలనుకుంటున్నారు.













